NTV Telugu Site icon

Kiran Abbavaram: నీకు పాన్ ఇండియా సినిమా ఎందుకున్న రిపోర్టర్.. కిరణ్ అబ్బవరం షాకింగ్ సమాధానం

Kiran Abbavaram Comments

Kiran Abbavaram Comments

Kiran Abbavaram Shocking Reply to Reporter: హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్న “క” సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక కిరణ్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు.

Rakul Preet Brother: రకుల్ సోదరుడితో పాటు సినీ ప్రముఖుల అరెస్ట్?

కానీ మీ స్థాయిలో ఉన్న హీరోలు ముఖ్యంగా మీరు పాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు సరైన సక్సెస్ లేదని మీరే చెబుతున్నారు అలాంటి సమయంలో మీరు పాన్ ఇండియా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దానికి కిరణ్ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. స్థాయి అంటే కంటెంటే, మొన్న మలయాళం నుంచి వచ్చిన మంజుమ్మాల్ బాయ్స్ సినిమాని పెద్ద హిట్ చేశాం, ఆ సినిమాలో నటించిన యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా? కాంతార కన్నా ముందు రక్షిత్ శెట్టి పేరు మనకి తెలుసా సార్? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కంటెంట్ కింగ్, నా స్థాయి పెద్దదా చిన్నదా అనేది కాదు ముఖ్యం సినిమాలో కంటెంట్ అనేదే ముఖ్యం. ఈ సినిమా కంటెంట్ స్థాయి పెద్దది, అన్ని భాషల్లో సినిమాను ఆదరిస్తారని నమ్మే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని కిరణ్ అబ్బవరం అన్నారు.

Show comments