Site icon NTV Telugu

KA10 : ‘దిల్ రూబా’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం

Dilruba

Dilruba

గతేడాది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే తన కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వచ్చిన “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు కిరణ్. అదే జోష్ తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు.

Also Read : Anand Devarakonda : ‘బేబి’ కాంబోలో మరో సినిమా.. దర్శకుడు ఎవరంటే..?

కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘దిల్ రూబా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా  ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ను జనవరి 3న రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి కాన్సెప్ట్ థీమ్ ను పరిచయం చేస్తూ ఓ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసారు కిరణ్. ఓ నది ఒడ్డున కూర్చుని డియర్ అమ్మాయిలు, అబ్బాయిలు నా పేరు సిద్ధార్ద్. నా ప్రేమను పరిచయం చేయదానికి మీ ముందుకు వచ్చా. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది మోస్ట్ అడిక్ట్ డ్రగ్. అలాంటి ప్రేమను మీకు పరిచయం చేయడానికి ‘దిల్ రూబా’ తో మీ ముందుకు వస్తున్నా అంటూ వీడియో రిలీజ్ చేసాడు.

Exit mobile version