NTV Telugu Site icon

Kiran Abbavaram: ఒక హీరోగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి!!

Kiran Abbavara

Kiran Abbavara

కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించగా దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి “క” సినిమా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా రెండు రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – క సినిమాకు ఘన విజయాన్ని అందించి ఈ దీపావళికి నాకు పెద్ద పండుగ ఇచ్చారు. మన తెలుగు ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు. టి

Amaran: రెండు రోజుల్లో దళపతి ‘గోట్’ కలెక్షన్ రికార్డును బద్దలు కొట్టిన అమరన్?

కెట్స్ కావాలని, ఇంకా థియేటర్స్ పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు, నాగవంశీ గారు, 14 రీల్స్ రామ్, గోపి గారు వీళ్లంతా శుభాకాంక్షలు తెలిపడం సంతోషంగా ఉంది. ఈ నెల 8వ తేదీన మలయాళంలో క సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అలాగే తమిళనాట ఉన్న తెలుగు ప్రజలు తమకు షోస్ కావాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక తమిళనాట ఎందుకు రిలీజ్ చేయడం లేదని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ గారిని తమిళనాట షోస్ వేయమని అడుగుతున్నా. ఫ్యామిలీస్ అంతా కలిసి మా క సినిమా చూసేందుకు వెళ్తున్నారు. అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ట్రెండ్ ప్రీమియర్స్ నుంచే మొదలైంది. అన్నారు. క సినిమా విజయం నాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చింది. హిట్ కొట్టాడు అనకుండా హిట్ కొట్టేశాము అంటున్నారు. ఇది తమ విజయంగా భావిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక హీరోగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. ఇంతమంది ఆదరణ ప్రేమ దక్కుతున్నాయి. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందా అనేది కాదు, ప్రేక్షకులకు చేరువైంది అనే విషయమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. క సినిమాకు తప్పకుండా సీక్వెల్ చేస్తాం. అది కృష్ణగిరి ఊరి ప్రత్యేకతలతో ఉంటుంది. అన్నారు.

Show comments