రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, ఇప్పటివరకు విడుదలైన ప్రచార సామగ్రి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమా మీద హైప్ రోజు రోజుకు పెరుగుతోంది.హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండటం తో, మ్యూజిక్ అండ్ బీజ్ ఇప్పటికే హై అంచనాలకు దారితీస్తోంది.
Also Read : Sreeleela : రెమ్యూనరేషన్ హైక్‌తో.. షాక్ ఇచ్చిన శ్రీ లీల !
తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో రెండవ సింగిల్‌గా ‘అన్న అంటేనే..’ అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందులో అన్నా-తమ్ముల అనుబంధాన్ని హృదయంలో చూపించనున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ తన చిన్నతనంలో సోదరుడితో దిగిన ఒక స్మారక ఫోటో కనిపించగా, అది అభిమానుల మనసులను తాకుతోంది.ఈ సినిమాలో హీరో సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సాంగ్ ప్రోమోను జూలై 15న సాయంత్రం 5:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
