Site icon NTV Telugu

Kingdom: ‘కింగ్డమ్’ సెన్సేషన్ – 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే ?

Kingdom (3)

Kingdom (3)

విజయ్ దేవరకొండకి ఎంతో అవసరమైన సక్సెస్‌ను అందిస్తూ, ‘కింగ్డమ్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఈ సినిమా టాలీవుడ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీక్ డే అయినా గురువారం విడుదలైన ఈ సినిమా, ఫస్ట్ డేనే ఏకంగా రూ.39 కోట్లు వసూలు చేసింది. ఈ మెస్మరైజింగ్ ఓపెనింగ్ తర్వాత శుక్రవారం, శనివారాల్లో కూడా కలెక్షన్స్ తగ్గలేదు. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుల మౌత్‌టాక్ సినిమాకు మరింత జోష్‌ అందించింది. ఫ్యామిలీ సెంటిమెంట్, కథా నేపథ్యం, యాక్షన్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Also Read:OG: ‘ఓజీ’ పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ సింగర్స్

స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ‘కింగ్డమ్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ను దాటి దూసుకుపోతోంది. ఇది విజయ్ దేవరకొండకు అక్కడి మార్కెట్‌లో రెండో సాలిడ్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే, ‘కింగ్డమ్’ తొలి వారం చివరికి ₹100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అనిపిస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామా అన్నదమ్ముల అనుబంధాన్ని చర్చించడంతోపాటు, విజయ్ దేవరకొండని మళ్లీ గట్టిగా నిలబెట్టింది. గత కొద్ది సినిమాల్లో విజయ్ దేవరకొండను విజయాలు ఎక్కువగా పలకరించలేదు. అయితే ‘కింగ్డమ్’ మాత్రం అతడి కెరీర్‌కి మళ్లీ పుంజుకునే మార్గాన్ని సృష్టించింది.

Exit mobile version