NTV Telugu Site icon

OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఎప్స్..ఎక్కడో తెలుసా ..?

Untitled Design (29)

Untitled Design (29)

హాలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మార్వెల్, DC నుండి వచ్చే సినిమాలు తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా రిలీజ్ అయి అంతే స్థాయిలో కలెక్షన్లు రాబడతాయి. ఓటీటీలోను హాలీవుడ్ సినిమాలను వీక్షించే టాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువే. కాగా హాలీవుడ్ లో విడుదలైన ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెస్ బాల్ దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రం  MAY 9న థియేటర్లలో రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంఛైజీ నుండి వచ్చిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూసారు. దాదాపు మూడు నెలల తర్వాత చిత్రం డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది.

ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆగస్టు2 స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారంకంగా ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో ప్రసారం కానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. మరికొద్ది రోజుల్లో ప్రసారం కానున్న ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ చిత్రాన్ని పనిలో పనిగా మీరు ఓ సారి వీక్షించండి.

Also Read : Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?

Show comments