Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్‌

Poorvaj

Poorvaj

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సై-ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ పూర్వాజ్ చేసిన ప్రకటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా సెకండాఫ్ ట్విస్ట్‌ను ఎవరైతే ముందుగా కనిపెట్టి చెప్తారో వారికి ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆయన అనౌన్స్ చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదని, దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, హైకోర్టు లాయర్ల సమక్షంలో అధికారికంగా ఈ ఛాలెంజ్‌ను ప్రకటిస్తున్నామని ఆయన స్పష్టం చేయడం విశేషం.

“మా సినిమా ప్రీమియర్స్ ఈ నెల 29న రాత్రి 10 గంటలకు పడతాయి. 11 గంటలకు సినిమాలోని అసలు ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరైతే ముందుగా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో, వారి పేరును సక్సెస్ మీట్‌లో డిస్‌ప్లే చేసి బహుమతి అందజేస్తాం” అని పూర్వాజ్ తెలిపారు. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయన ఒక కోటి రూపాయలను రివార్డుగా ప్రకటించడం జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. అయితే, స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా రాసుకున్నామని, ఆ ట్విస్ట్ కనిపెట్టడం అంత ఈజీ కాదని దర్శకుడు ఎంతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.