BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్

Brb

Brb

శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. మార్క్ మూవీ ఫ్లాపైనా బిల్లా రంగా భాషాతో కవర్ చేసేస్తాడన్న హోప్స్‌తో ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటోందన్న అప్డేట్స్ మూవీ టీం పంచుకోకపోవడంతో మూవీ ఆగిపోయిందన్న రూమర్స్ వినిపించాయి. కానీ ఈ సినిమాను 2024లో ఎనౌన్స్ చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

విక్రాంత్ రోణతో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనూప్ భండారీకి మరో ఛాన్స్ ఇచ్చాడు కిచ్చా సుదీప్. మొదటి షెడ్యూల్లో 20 డేస్ షూట్ కంప్లీట్ చేశారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించారు కూడా. కానీ సైలెంట్ అయిపోయింది టీం. దీనిపై ఫ్యాన్స్ వర్రీ అవుతుండటంతో రీసెంట్లీ సుదీప్ క్లారిటీ ఇచ్చాడు. ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చానని చెప్పాడు. జూన్ 26న నుండి మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నట్లు కన్ఫర్మేషన్ చేశాడు. అలాగే ఈ గ్యాప్‌లో నాలుగు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. త్వరలో వాటి ఎనౌన్స్ మెంట్ చేస్తానని రివీల్ చేశాడు. బిల్లా రంగా భాషాని ఎక్స్ పరిమెంటల్‌గా మూవీగా తెరకెక్కింబోతున్నాడు అనూప్ భండారీ. సినిమా 2209లో జరిగిన స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. వీఎఫ్ఎక్స్ టాప్‌ లెవల్లో ఉండబోతున్నాయని టాక్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోతుంది. విక్రాంత్ రోణతో సుదీప్‌కి హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని అందించిన అనూప్.. మరో బ్లాక్ బస్టర్ అందించి తనపై హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాదో లేదో చూడాలి.