ఈ మధ్య కాలంలో తెలుగు కుర్రాళ్లని తన కైపుతో వెర్రిక్కించి బాలీవుడ్ కి జంపైన హీరోయిన్ కియారా ఒక్కరే! ఆమె చేసింది రెండు సినిమాలే అయినా మళ్లీ వస్తుందనీ, రావాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక్కడి హీరోలు కూడా కియారా సై అంటే సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ముంబై బ్యూటీ హిందీ సినిమాలతో యమ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. మరి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్లు తగులుతుంటే తెలుగు తెర మీదకి ఎందుకు వస్తారు ఎవరైనా?
బీ-టౌన్ లో బాగా బిజీగానే ఉన్నా తాజాగా కియారా అద్వాణీ టాలీవుడ్ కు ఓ సారి వచ్చి పోతానని హింట్ అయితే ఇచ్చింది! సొషల్ మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా ఆమె అభిమాని ప్రశ్నకి ‘ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్ సూన్’ అంటూ ఊరించే సమాధానం ఇచ్చింది. కియారాని సదరు ఫ్యాన్, ‘’తెలుగు సినిమా పరిశ్రమకి మళ్లీ ఎప్పుడు రిటర్న్ వస్తారు?’’ అని ప్రశ్నించాడు. దానికి ‘వినయ విధేయ భామ’ ‘త్వరలోనే’ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది!
ఇంతకీ, కియారా ‘ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్ అన్నది ఏ మూవీ గురించి? ‘ఎన్టీఆర్30’ అంటున్నారు కొందరు ఫిల్మ్ నగర్ జనం. ‘జనతా గ్యారేజ్’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ త్వరలోనే సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ నెక్ట్స్ అదే కాబోతోంది. అందులో తారక్ సరసన ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించిన కియారా యాక్ట్ చేయబోతోందట! అదే నిజమైతే కొరటాల డైరెక్షన్ లో ఆమెకి ఇది రెండో సినిమా అవుతుంది. చూడాలి మరి, అందాల ‘వసుమతి’ అభిమానగణానికి ఆ గుడ్ న్యూస్ ఎప్పటికి వస్తుందో!
