Site icon NTV Telugu

అలాంటి వారే బలంగా ఉంటాయి: కియారా అద్వానీ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వరుస అవకాశాలను దక్కించుకుంటూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బోయపాటి శ్రీను-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో ‘జుగ్‌ జుగ్‌ జియో’, ‘షేర్‌ షా’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మరో రెండు సినిమాలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంటే, ఇటీవల ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. అయితే ఓ అభిమాని.. కియారాకు అభద్రత ఎక్కువని ప్రశ్నించగా ఆమె స్పందించింది. ‘అవును.. అభద్రత మనల్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే బలవంతులుగా తయారుచేస్తుంది. ప్రతి ఒక్కరిలో అభద్రత కొంచెమైనా ఉంటే వారు పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అభద్రత నాలోని ఉత్తమమైన ప్రతిభను వెలికితీస్తుంది’ అని కియారా తన స్టైల్ లో సమాధానం ఇచ్చింది.

Exit mobile version