Site icon NTV Telugu

శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Kiara Advani is confirmed as the female lead of Ram Charan in Shakar’s film

ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ” తర్వాత రామ్ చరణ్ తో ఆమె నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ ప్రకటన రాకముందు మూవీలో చరణ్ రొమాన్స్ చేయబోయే హీరోయిన్లు వీళ్ళేనంటూ చాలామంది టాప్ హీరోయిన్ల పేర్లు విన్పించాయి.

Read Also : డిస్నీకి వ్యతిరేకంగా “బ్లాక్ విడో” కేసు

ఆ జాబితాలో కియారా, అలియా భట్, రశ్మిక మండన్న ఉన్నారు. ఇక కియారా విషయానికొస్తే తెలుగులో ఆమె చివరగా “వినయ విధేయ రామ”లో కన్పించింది. “భరత్ అనే నేను”తో కియారా తన కెరీర్‌లో మొదటి విజయాన్ని సాధించింది. తరువాత ఆమె బాలీవుడ్‌లో ఆఫర్లను అందుకుంది. మరోవైపు “ఆర్సీ 15″కు సంబంధించిన పనులను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటివరకు దర్శకుడు శంకర్ తమన్ ను సంగీత దర్శకుడుగా, జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ గా, సాయి మాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్ గా అఫీషియల్ గా నిర్ధారించారు. “ఆర్సి 15” ఆగస్టులో అధికారికంగా ప్రారంభించబడుతుంది.

Exit mobile version