ఇటీవల కాలంలో నటీ నటుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు తరుచూ హ్యాకింగ్ చేస్తున్నారు. వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుని వాటిల్లో అసభ్యమైన పోస్టులు, అర్ధం లేని మెసేజ్‌లు పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సీనియర్ నటి ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాని ఇన్‌స్టాలో ద్యార వెల్లడించింది. హ్యాకర్లు తనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారని కూడా తెలుపుతూ.. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది ఖుష్బూ.
Also Read: Shahrukh Khan : అలాంటి ఒత్తిడి మాత్రం ఉండకూడదు..
‘హ్యాకింగ్‌కు గురి కావడంతో నా అకౌంట్‌లోకి లాగిన్ కాలేక పోతున్న, నా ఐడీ, పాస్‌వర్డ్ నిరుపయోగంగా మారాయి. గత 9 గంటలుగా నా అకౌంట్‌లో ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అభిమానులు కొంచెం వేచి చూడాలని విజ్ఞప్తి. నా ట్విట్టర్ పేజీలో ఏ పోస్టులు కనిపించిన వెంటనే నాకు తెలియజేయండి’ అంటూ హ్యాకర్లు నుంచి వచ్చిన వాట్సాప్ మేసేజీల స్క్రీన్ షాట్స్‌ను ఖుష్బూ శనివారం సాయంత్రం నెట్టింట పంచుకుంది. యూకేలో హ్యాకర్స్ చాలా మంది తయారవుతున్నారు. దయచేసి ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది ఖుష్బూ.
