NTV Telugu Site icon

Praveen Paruchuri: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ నిర్మాత ప్రవీణ కొత్త చిత్రం !

Praveen Paruchuri

Praveen Paruchuri

Praveen Paruchuri:’కేరాఫ్‌ కంచెరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. కథే హీరో గా తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. అదే తరహాలో నిర్మాత ప్రవీణ పరుచూరి చిత్రాలను నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి అయిన ప్రవీణ అమెరికాలో స్థిరపడ్డారు, తెలుగు సినిమా, భాషపై అభిమానంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు… న‌టిగానూ త‌న స‌త్తాను చాటుతున్నారు.

Read also: Acharya-Akhanda: చిరు, బాలయ్య పోటీలో సెంటిమెంట్స్!

కొత్త టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్న ప్రవీణ పరుచూరి ప్రస్తుతం తన మూడో సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రవీణ పరుచూరి తాను నిర్మించబోయే మూడో సినిమా కోసం త్వరలో ఆడిషన్ అనౌన్స్ చేయబోతున్నారు. తన గత చిత్రాల తరహాలో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నారు.
Tammineni Sitaram: అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర