NTV Telugu Site icon

Keerthy Suresh : కీర్తిసురేష్ పెళ్లి ఎప్పుడు – ఎక్కడంటే..?

Keerthy

Keerthy

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి  సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుని తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి . ఇటీవల కీర్తి సోలోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కాగా కీర్తి పెళ్లి అని ఇటీవల న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి క‌మెడియ‌న్ తో ల‌వ్ అని, మరోసారి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను పెళ్లి చేసుకోబోతుంద‌ని , ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్‌మెంట్ రోజుకొకపుకార్లు వినిపించాయి.

Also Read : Pushpa -2 : ఇది సార్ ‘పుష్పరాజ్’ గాని బ్రాండ్..

తాజాగా మరోసారి కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కానీ ఈ వార్తలు నిజమే అని కోలీవుడ్ మీడియా అంటోంది. కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోని తత్తిల్ ను పెళ్లాడబోతుంది. కీర్తి, ఆంటోనీ గత 15సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట. ఇక ఆంటోనీ విషయానికి వస్తే కేరళ లోని కొచ్చికి చెందిన వాడు. గత పదేళ్లుగా ఆంటోనీ దుబాయ్ లో పెద్ద బిజినెస్ మాన్ గా సెటిల్ అయ్యారు. ఎప్పటి నుండో ప్రేమలు ఉన్న ఈ జంట పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తూ మొత్తానికి ఇరు కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లి చేసుకోబోతున్నారు. కీర్తి , ఆంటోని కళ్యాణం డిసెంబరు 11న ఫిక్స్ చేశారట. ఈ వివాహ వేడుకను గోవా బీచ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ లా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట. మొత్తానికి మహానటి మెట్టినింట అడుగుపెట్టనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Show comments