కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ లాంటి సినిమా చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే, ఎందుకో ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు అయితే దొరకలేదు. ముందుగా గిరి గీసుకుని కూర్చున్న ఆమె, అవకాశాలు తగ్గటంతో గ్లామరస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధమైంది. అయినా సరే, ఆమెకి పూర్తిస్థాయిలో అవకాశాలు అయితే రావడం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆమె, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది. అయితే, తెలుగు సినిమాల విషయంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, ఆమెను వేణు దర్శకత్వం వహించబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు. నితిన్ పక్కన ఆమె నటించాల్సి ఉంది, కానీ ఎందుకో చివరి నిమిషంలో ఆమె నటించనని క్యాన్సిల్ చేసుకుంది.
Also Read : Lokesh Kanagaraj : పవన్’తో అలాంటి సినిమా.. వామ్మో లోకేష్?
అయితే, ఇప్పుడు ఆ సినిమా నితిన్ నుంచి దేవిశ్రీప్రసాద్ యాక్టింగ్ డెబ్యూ సినిమాగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించమని కీర్తి సురేష్ ని సంప్రదించగా, అందుకు ఆమె ఒప్పుకున్నట్లుగా సమాచారం. అంటే, కథ నితిన్ దగ్గర ఉన్నప్పుడు నటించడానికి నో చెప్పిన ఆమె, ఇప్పుడు అదే కథ దేవిశ్రీప్రసాద్ దగ్గరికి వెళ్ళాక నటిస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆమె నితిన్ ఉన్నాడని నటించనని చెప్పిందా లేక ఇప్పుడు దేవిశ్రీ ఉన్నాడని నటిస్తానని చెప్పిందా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. నిజానికి, ఆమె చేతిలో ఒక సాలిడ్ సినిమా ఉందంటే, అది విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమానే. ‘రౌడీ జనార్ధన్’ పేరుతో రూపొందబోతున్న ఈ సినిమా తర్వాత, అదే బ్యానర్లో రూపొందబోతున్న ‘ఎల్లమ్మ’లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తోంది.
