Site icon NTV Telugu

keerthy Suresh : సూర్య కి జోడిగా కీర్తి సురేష్‌..

Surya Keerthi Suresh

Surya Keerthi Suresh

కీర్తి సురేష్..ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ‘మ‌హాన‌టి’. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన‌ ఈ భామ‌, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తర్వాత నానికి జోడీగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్  ఛాన్స్ లు రావడంతో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగింది కీర్తి. కానీ గత రెండేళ్లుగా తెలుగు సినిమాలు బ్రేక్‌నిచ్చింది. ప్రస్తుతం ఈ భామ తమిళ ఇండస్ట్రీ పై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ భారీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిస్తోంది.

Also Read: Puri Jagannad : పవర్‌ఫుల్ విలన్‌ని సెట్ చేసిన పూరి జగన్నాధ్..?

వివరాల్లోకి వెళితే.. ‘లక్కీ భాస్కర్‌’ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి.. త్వరలో తమిళ అగ్ర హీరో సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు. మారుతీ కార్లకు సంబంధించిన నేపథ్య కథాంశంతో తెరకెక్కించనున్న బయోపిక్‌ అని సమాచారం. ‘796 సీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాలో కథానాయికగా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్‌ను ఫైనల్‌ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించనుంది. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం.

Exit mobile version