Site icon NTV Telugu

Keerthi Suresh : బాలీవుడ్‌లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..

Keerthi Suresh

Keerthi Suresh

టాలీవుడ్ క్లాసిక్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. కెరీర్ ఆరంభంలో నుంచి మంచి మంచి కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ అమ్మడు.. ‘మహానటి’ మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా టాలీవుడ్‌తో పాటు కోలివుడ్ లోను వరుస సినిమాలు తీసిన కీర్తి‌ ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గుతాయని భావించారు. కానీ ఇప్పుడామెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Also Read: Prabhas : ‘స్పిరిట్‌’ కోసం దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

తాజా సమాచారం ప్రకారం.. హిందీలో మరో ప్రాజెక్టు కోసం పలువురు దర్శక నిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు, కొన్ని రోజులుగా నెట్టింట్లో వార్తలు వినపడుతుండగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పై రూపొందుతున్న ఓ చిత్రంలో బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావుతో కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖారారు కాని ఈ ప్రాజెక్టును, రాజ్ తన సొంత నిర్మాణ సంస్థ పై తీర్చిదిద్దుతున్నారు. ‘సెక్టార్ 36’ ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తుండగా,జూన్‌ల్లో ముంబయిలో చిత్రీకరణ ప్రారంభం కానుందట. ప్రస్తుతం విద్యను ఒక వ్యాపారంలా చేస్తున్నారు. ఈ వ్యవస్థలోని కుంభకోణాలను బయట పెట్టే విద్యావేత్తగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుందట కీర్తి.

Exit mobile version