NTV Telugu Site icon

Baby Jhan : పసుపు తాడుతో సినిమా ప్రచారంలో ‘కీర్తి సురేష్’

Keerthy

Keerthy

తమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితం తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని వివాహమాడిని సంగతి తెలిసిందే. గోవాలోనికి ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంలో హిందూ వివాహ పద్దతిలో అలాగే క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకుంది. అందుకు సంబందించిన ఫోటోలను కూడా కీర్తి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సినీ ప్రేక్షకులు, కీర్తి ఫ్యాన్స్ నవదంపతులు శుభాకాంక్షలు తెలియజేసారు.

Also Read : DhanaShree : చాహల్ చెలి సొగసులు చూస్తే.. చలి ఎటుపోయెనో!

మరోవైపు కీర్తి పెళ్లికి ముందు కొన్ని సినిమాలలో నటించింది. అందులో వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ‘బేబీ జాన్’ ఒకటి. అట్లీ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు అఫీషియల్ రీమేక్. అయితే ఈ సినిమా షూటింగ్ ,ముగించిన కీర్తి పెళ్లి పనుల కారణంగా ప్రమోషన్స్ లకు కొద్ది రోజులగా దూరంగా ఉంది. పెళ్లి కార్యక్రమాలు ముగించి బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది కీర్తి. కానీ ఈ ప్రమోషన్స్ కు మోడరన్ డ్రెస్ లో మేడలో పసుపు తాడుతో వచ్చింది. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే నిర్మాతల మేలుకోరి పెళ్లయిన రెండు మూడు రోజులలోనే ఇలా ప్రమోషన్స్ కు రావడం అభినందించదగ్గ విషయం అని నెటిజన్స్ కీర్తిని ప్రసంశిస్తున్నారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ  సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Show comments