పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం.. ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. క్రిష్ దర్శకత్వం ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తవడంతో, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నది పవన్ కళ్యాణ్ అబ్బురం కాదు.. ఇంకొకరి మాయే.. అదే మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి సంగీత మంత్రం..
Also Read : Parents’ responsibility : పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రుల బాధ్యత
ఈ చిత్రానికి కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, మాస్ బీట్‌లు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. పవన్ ఫ్యాన్స్ సైతం కీరవాణి శైలిని చూసి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా, ఇది సాధారణంగా అతని నుంచి ఆశించని ఓ మాస్ మ్యూజికల్ ట్రీట్‌గా నిలిచింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్‌కి తగ్గట్టు దూకుడుగా కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నీ ఈ చిత్రానికి బలమైన పాయింట్లు గా నిలిచాయి. దీంతో కీరవాణి మ్యూజిక్ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ప్రేక్షకులు “పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు.. ఈసారి కీరవాణి కూడా స్క్రీన్‌ను దద్దరిల్లించేశాడు” అంటూ సోషల్ మీడియాలో ఫుల్‌గా శభాష్ అంటున్నారు. HHVM లో కీరవాణి మాస్ మ్యూజిక్ మరోసారి నిరూపించింది.. ఆయన సునాయాసంగా ఏ జానర్‌లోనైనా మ్యాజిక్ చేయగలడని..!
