Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: సౌత్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త జోష్‌లో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా తన పాఠశాల రోజుల్లో ఎదురైన ఒక భయంకరమైన లైంగిక వేధింపుల చేదు అనుభవాన్ని పంచుకుంది. తనను వేధించిన కామాంధుడికి తను ఇచ్చిన షాకింగ్ ట్రీట్మెంట్ గురించి ఓపెన్ అయింది. స్కూల్ రోజుల్లో తన ఇంటికి సమీపంలో టెన్త్ క్లాస్ ట్యూషన్‌కు వెళ్లేటప్పుడు జరిగిన సంఘటనను ఒక ఇంటర్వ్యూలో కాయాదు గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా కాయాదు మాట్లాడుతూ.. “నేను ట్యూషన్‌కు వెళ్లే దారిలో కొందరు యువకులు నన్ను రోజూ ఏడిపించేవారు, వేధించేవారు. మొదటి రోజు సరేలే అని వదిలేశాను. రెండో రోజు కూడా అలాగే భరించాను. కానీ మూడో రోజు మాత్రం నా ఓపిక నశించింది, ఇక అస్సలు తట్టుకోలేకపోయాను” అని కాయాదు లోహర్ పేర్కొంది.
ఆ సమయంలో తనకు వచ్చిన కోపం చూసి నన్ను ఏడిపించిన వారు కూడా ఊహించి ఉండరని కాయాదు చెప్పింది. “నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. కింద ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని వాళ్లపైకి బలంగా విసిరాను. అది వెళ్లి నేరుగా ఒకడి తలకు తగలడంతో వాడి తల పగిలిపోయింది. తల నుంచి రక్తం కారడం చూసి నేను వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు” అంటూ ఆ నాటి సంఘటనను బయటపెట్టింది. అలా ఒకరి తల పగలగొట్టడం సరైన పద్ధతి కాదని ఇప్పుడు అనిపిస్తున్నా.. ఆ వయసులో తనకు తోచిన పద్ధతిలో బుద్ధి చెప్పానని కాయాదు చెప్పింది. తాను స్వభావరీత్యా చాలా ప్రశాంతంగా ఉంటానని, కానీ తప్పును మాత్రం అస్సలు సహించనని క్లారిటీ ఇచ్చింది. కాయాదు లోహర్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అథర్వ సరసన ‘ఇధయ మురళి’, జీవీ ప్రకాష్ కుమార్ సరసన ‘ఇమ్మోర్టల్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవే కాకుండా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఐ యామ్ గేమ్’, పృథ్వీరాజ్ సుకుమారన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఖలీఫా’, న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ది పారడైజ్’ వంటి భారీ చిత్రాల్లో కాయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది.
Also Read
- Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
- SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
- Ilayaraja : ఇళయరాజాకు భారీ షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!