NTV Telugu Site icon

Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కావ్య

Kavya Thapar Interview

Kavya Thapar Interview

కావ్య థాపర్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవలే విశ్వం అనే సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రండి అనే పదం వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పుకొచ్చింది. నిజానికి తెలుగులో రండి అంటే గౌరవిస్తూ రమ్మని పిలవడం. కానీ హిందీలో అదొక పెద్ద బూతు.

KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్.. ఎందుకంటే?

ఆ విషయం తెలియక ఆమెను ఆమె తల్లిని షాట్ రెడీగా ఉందంటూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హడావుడిగా వెళ్లి పిలిచాడట. షాట్ రెడీగా ఉంది మీరు త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోయాడట. అయితే తమను బూతులు తిట్టాడేమో అనే ఉద్దేశంతో కోపంగా ఆ సినిమా నిర్మాత అయిన ఒక లేడీ దగ్గరికి వెళ్లి విషయం చెబితే ఆమె పడి పడి నవ్వి అసలు విషయం వెల్లడించిందట దీంతో ఆ రండి అనే పదం వల్ల తాను ఎదుర్కొన్న ఈ విషయాన్ని ఆమె ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది కావ్య థాపర్.

Show comments