Site icon NTV Telugu

ఆగస్ట్ లో ఆగమనానికి అమితాబ్ రెడీ! ‘కౌన్ బనేగా…’కు కౌంట్ డౌన్ షురూ…

Kaun Banega Crorepati-13 on August 23rd

‘కౌన్ బనేగా కరోడ్ పతి’… ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన షోస్ లో ఒకటి! 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సీజన్ తో మన ముందుకు రాబోతోంది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆన్ ఎయిర్ అలరించిన క్విజ్ ప్రొగ్రామ్ ఇంకా అదే జోరుతో కొనసాగుతోంది. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనగానే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే! దేశంలో ఇతర సూపర్ స్టార్స్ కూడా సేమ్ ఫార్మాట్ లో షోస్ నిర్వహించినా ఎవ్వరికీ వర్కవుట్ కానిది బిగ్ బికి సాధ్యమైంది! అందుకే, ‘కౌన్ బనేగా…’ నిర్వాహకులు మరోసారి బాలీవుడ్ సూపర్ స్టార్ తో కలసి మన ముందుకొస్తున్నారు!

Read Also : “విక్రమ్” షూటింగ్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్

ముంబైలో ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం, ఆగస్ట్ 23 నుంచీ ‘కౌన్ బనేగా…’ తాజా సీజన్ మొదలవుతుందట. అయితే, ఇంతకు ముందటి సీజన్స్ తో పోలిస్తే కొన్ని మార్పులుచేర్పులు ఉండబోతున్నాయి. ప్రధానంగా కోవిడ్ 19ను దృష్టిలో పెట్టుకుని సెలక్షన్, స్క్రీనింగ్ ప్రాసెస్ డిజిటల్ గా చేయబోతున్నారు. మరింత స్పష్టంగా వివరాలు తెలియాలంటే మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! అయితే, వచ్చే నెలలో ‘కౌన్ బనేగా…’ కొత్త సీజన్ మొదలవటం మాత్రం పక్కా అంటున్నారు. మరోసారి బిగ్ బి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు.

అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్ బై, చెహ్రే, బ్రహ్మాస్త్ర’ సినిమాలు కూడా రానున్న నెలల్లో పెద్ద తెరపై అభిమానుల్ని అలరించబోతున్నాయి.

Exit mobile version