Site icon NTV Telugu

Satya Raj: ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కట్టప్ప..

Untitled Design (57)

Untitled Design (57)

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్. విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇటీవల లవ్ గురు చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు కానీ హిట్ మాత్రం దక్కలేదు. తుఫాన్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని బావిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగులో నేను మీకు తెలుసా చిత్రానికి సంగీతం అందించిన అచ్చు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రంలో బాహుబలి సత్య రాజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సత్యరాజ్ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా తమిళ ట్రైలర్ లాంఛ్ లో నా స్పీచ్ కు చాలా మీమ్స్ వచ్చాయి. ఈ మూవీలో లాస్ట్ మినిట్ నేను జాయిన్ అయ్యాను. నా క్యారెక్టర్ ను దర్శకుడు విజయ్ మిల్టన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. నా లుక్, మేకోవర్ అంతా కొత్త ఉంటుంది. ప్రొడ్యూసర్ ధనుంజయన్ చిన్న పిల్లాడి ఫేస్ తో ఉంటారు. ఆయన అడిగితే ఏదీ కాదని చెప్పాలనిపించదు. విజయ్ ఆంటోనీ కి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ను ఎలా వేర్వేరుగా చూసుకోవాలో తెలుసు. ఆయన ఒక ఫిలాసపర్. ఆయన జీవితంలో ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొంటారు. నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేయాలని కోరుతున్నా, తెలుగులో బాహుబలి నా అల్ టైమ్ ఫేవరేట్ మూవీ” అని అన్నారు.

Also Read: Devara: సెకండ్ సింగిల్ అప్ డేట్ వచ్చేసింది..సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

Exit mobile version