Site icon NTV Telugu

Katrina Kaif : పేరెంట్స్ కాబోతున్న మరో బాలీవుడ్‌ జంట..!

Kartinakaif

Kartinakaif

ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఒక్కప్పుడు హీరోలు హీరోయిన్ లు కెరీర్‌కి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చేవారు. వివాహ బంధానికి ఆమడ దూరంలో ఉండేవారు. ముఖ్యంగా నటిమనులు పెళ్ళి అయితే అవకాశాలు రావు అనే ఉద్దేశంతో కూడా చేసుకునే వారు కాదు. కానీ ప్రజంట్ రోజులు మారిపోయాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితానికి ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. హీరోయిన్ లు కూడా కెరీర్ పీక్స్ లో ఉండగానే మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెడుతున్నారు. అంతే కాదు ఏడాది తిరగక ముందే గుడ్ న్యూస్ కూడా చెబుతూ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కియారా – సిద్ధార్థ్‌కి పాప పుట్టింది, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తాజాగా బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ కూడా తాము పేరెంట్స్ కాబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read : Su From So : తెలుగులోకి వచేస్తున్న మరో కన్నడ హిట్‌ మూవీ..

ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకుండానే ప్రేమలో పడిన ఈ జంట, చాలా కాలం వరకు తాము రిలేషన్‌లో ఉన్నామని బయటపడలేదు. అయితే కరణ్ జోహార్ షోలో కత్రినా చేసిన కామెంట్‌ తరువాత, అవార్డ్ వేడుకలో విక్కీ ప్రపోజల్ ఇచ్చినప్పటి నుంచి వీరి ప్రేమ కథ బహిర్గతం అయింది. అలా ఇరు కుటుంభల సమక్షంలో 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగిన వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ శుభవార్త ఏప్పుడెప్పుడు చెబుతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ మధ్య వీరిద్దరూ ముంబై నుంచి అలీబాగ్‌కి ప్రయాణిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో కత్రినా ధరించిన  తెల్లటి చొక్కా చర్చనీయాంశమైంది. దీంతో సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ గాసిప్స్ ఊపందుకున్నాయి. కేవలం ప్రెగ్నెంట్ అయినవారు మాత్రమే ధరించే ఈ చొక్కాను కత్రినా ఎందుకు ధరించారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి వార్తలకు మరింత బలాన్నిచ్చే వాడు ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు. కత్రినా ఇప్పటికే రెండు నెలల గర్భవతిగా ఉన్నారని ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విక్కీ కానీ కత్రినా కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం తెగ సంతోషపడుతున్నారు. ఇది నిజమో, గాసిప్‌గానే మిగిలిపోతుందో – అధికారిక క్లారిటీ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే!

Exit mobile version