Katrina Kaif: కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో అత్యంత ఇష్టపడే స్క్రీన్ జంటలలో ఒకరు. వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని అభిమానులు వారి సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు టైగర్-3లో వీద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.’టైగర్ 3’లో సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయనుండటం అద్భుతంగా అనిపిస్తోందని నటి కత్రినా కైఫ్ పేర్కొంది. విక్కీ కౌశల్ తో తన పెళ్లి తర్వాత కత్రినా నటించిన తొలి సినిమా ‘ఫోన్ భూత్’. ఆమె సినిమా ప్రమోషన్స్ భాగంగా మాట్లాడుతూ.. త్వరలో తాను చేయబోయే ‘టైగర్-3’ గురించి ప్రస్తావించింది. టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ సినిమాల్లోనూ సల్మాన్, కత్రినా కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి సందడి చేయనున్నారు.
Read also: Yv Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
మనీష్ శర్మ, ఆదిత్య చోప్రా.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన టైగర్ 3 వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది. మార్చిలో, సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో విడుదల తేదీని ప్రకటిస్తూ తన అభిమానులతో టీజర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో, సల్మాన్ కునుకు తీస్తుండగా కత్రినా యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తుంది. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, “హమ్ సబ్ అప్నా అప్నా ఖయల్ రఖేన్… టైగర్3 .. 2023 ఈద్ … అందరం కలిసి ఉందాం ..ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగులో విడుదల చేస్తున్నాం. #Tiger3ని #YRF50 అని.. 21 ఏప్రిల్ 2023న అంటూ షేర్ చేశాడ్ సల్మాన్.
ఇక సల్మాన్ ఖాన్ “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంటూ తన బిజీ షెడ్యూల్ ను ఈవిధంగా షేర్ చేసుకుంటున్నాడు సల్మాన్ భాయ్.. సల్మాన్ ఇటీవల తన ఫోటోను పంచుకున్నాడు.. అందులో సల్మాన్ పొట్టి జుట్టుతో కనిపించాడు. అంతేకాదు తన ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు, ” కిసీ కా భాయ్ కిసీ కి జాన్” అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు సల్మాన్ #KisiKaBhaiKisiKiJaan.” సల్మాఖాన్.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్‌లో కూడా అతిధి పాత్రలో నటించనున్నాడు.
Woh tha kisi ka bhai, yeh hai kisi ki jaan … #KisiKaBhaiKisiKiJaan pic.twitter.com/d6x5czN7Su
— Salman Khan (@BeingSalmanKhan) October 5, 2022
