NTV Telugu Site icon

Kasthuri: రెండో సినిమాకే కమిట్మెంట్ అడిగారు.. మొహం మీదే అలా.. కస్తూరి సంచలనం

Kasthuri

Kasthuri

Kasthuri Reveaks her Casting Couch Experiences: కస్తూరి గురించి మన తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషలలో నటించిన ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. పలు చిత్రాల్లో ఆమె ప్రముఖ నటుల సరసన నటించింది. గత ఏడాది తమిళరసన్, రాయర్ పరంపరై, స్టిక్కర్ తదితర చిత్రాల్లో నటించిన కస్తూరి ఈ ఏడాది తెలుగులో సింబా అనే సినిమాలో కనిపించింది. తెలుగులో గృహాలక్ష్మీ అనే సీరియల్ లో కూడా కనిపించి మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది. ఇక తాజాగా కేరళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన హేమ కమిటీ నివేదికపై ఆమె మాట్లాడారు. హేమా కమిటీ నివేదిక విడుదలైన తర్వాత, చాలా మంది నటీమణులు లైంగిక హింస, లైంగిక వేధింపులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలో తన రెండో సినిమాలోనే దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగాడని నటి కస్తూరి చెప్పడం సంచలనం సృష్టించింది.

Darshan: జైల్లో ఉన్నా కొవ్వు కరగలేదే.. మీడియాకు మధ్య వేలు చూపించిన దర్శన్?

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా రెండో సినిమాలో ఆ సినిమా దర్శకుడు నాతో అనుచితంగా మాట్లాడి కమిట్మెంట్ కావాలని, అడ్జస్ట్‌మెంట్ చేసుకోమని అడిగాడు.. అతడి ఉద్దేశం నాకు అర్థమైంది.. అందుకే షూటింగ్ స్పాట్‌లోనే అందరి ముందు తిట్టాను. నేను అతనికి సహకరించలేదు కాబట్టి, సినిమా మొదటి దశ పూర్తయిన తర్వాత కూడా నన్ను సినిమా నుండి తప్పించారు. సాధారణంగా సినిమాలో నటించేందుకు కమిట్ అయినప్పుడు… ఆ పాత్రకు ఈ నటి సెట్ అవుతుందా? ఆమె శరీరం ఎలా ఉంది? అనేది ఆడిషన్‌లోనే తెలుస్తుంది. అప్పట్లో నేను సన్నగా ఉన్నానని తన కళ్లకు తెలియదు…అలాగే ఫస్ట్ ఫేజ్ షూటింగ్ అయ్యాక నేను సన్నగా ఉన్నానని కారణంతో తప్పించారు. నాకు డ్యాన్స్‌, యాక్టింగ్‌ సరిగా రావడం లేదని తను చెప్పి ఉంటే నా మనసుకు ప్రశాంతత లభించేది. అయితే ఇంత నీచమైన కారణంతో నన్ను బయటకు పంపేసినప్పుడు నేనే కాదు షూటింగ్ స్పాట్‌లో ఉన్న కొంతమంది కూడా నాతో పాటు నవ్వుకున్నారని ఆమె అన్నారు. ఇక నేను ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా అమ్మ న్యాయవాది, నాకు కూడా చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. సినిమాపై ఆధారపడి జీవనోపాధి కోసం కొందరు మహిళలు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారు అమ్మాయిలను ఎలా తయారు చేస్తారో ఆలోచించుకోవాలని అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలనుకున్న అమ్మాయిలు ధైర్యంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.