Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్

Karuppu

Karuppu

సూర్య హీరోగా RJ బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కరుప్పు. డ్రీమ్ వారియర్ పిచర్స్ బ్యానర్ పై S R ప్రభు  & S R ప్రకాష్ బాబు నిర్మించిన కరుప్పు ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల కావాల్సిఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ సినిమా షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోస్ కు బుక్ చేసిన టికెట్స్ ని రద్దు చేసి రిఫండ్ చేసారు. అభిమానులను మరియు ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ సినిమా ఈరోజు మంచి స్పీడ్ చూపించింది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయి భారీ ఓపెనింగ్ ఉంటుందనుకున్న టైమ్ లో  వాయిదా పడింది.

ఈ సినిమా రిలీజ్ కు ఆర్థిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయని సమాచారం ప్రకారం. సినిమా విడుదలకు క్లియరెన్స్ రావాలంటే దాదాపు 50 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందట. ఈ భారీ మొత్తాన్ని సర్దుబాటు చేసేందుకు మేకర్స్ కిందా మీదా అవుతున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను ముఖ్యంగా USA లోని ప్రముఖ థియేటర్ చైన్స్  ఈరోజు జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేయడమే కాకుండా, వీకెండ్ మొత్తం షోలను ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాయి. ఒకవేళ ఈ రోజు చివరి నిమిషంలో క్లియరెన్స్ వచ్చినా  అనుకున్న స్థాయిలో షోలు పడటం కష్టమేనని ట్రేడ్ భావిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఫ్యాన్స్ కు అంతా అయోమయంగా ఉంది. రేపటివరకైనా  ఈ సమస్యలు పరిష్కారమై సినిమా సజావుగా విడుదలవుతుందా లేదా అనే టెన్షన్ ఫ్యాన్స్ లో ఉంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు షోలు రద్దు కావడంతో నిరాశ చెందుతున్నారు.