Site icon NTV Telugu

స్టేజిపైనే లవర్‌ కు ప్రపోజ్‌ చేసిన హీరో కార్తికేయ !

యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. అయితే.. నిన్న “రాజా విక్రమార్క” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. అయితే..ఈ రాజ విక్రమార్క మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికపై ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తన గాళ్‌ఫ్రెండ్‌, కాబోయే భార్య లోహితకు కార్తికేయ స్టేజిపైనే ప్రపోజ్‌ చేసాడు. ప్రేమ కోసం నా లైఫ్‌లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్‌ పెట్టానని అన్నాడు కార్తికేయ. ఆ అమ్మాయితో ఈ నెల 21న వివాహం జరగనుంది. తన పేరు లోహిత అని కార్తికేయ అందరికి పరిచయం చేశాడు. ఇక కార్తీకేయ ప్రపోజ్‌ చేసిన సన్నివేశం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Exit mobile version