Site icon NTV Telugu

కార్తీక్ రాజు హీరోగా సందీప్ గోపిశెట్టి హారర్ మూవీ!

Karthik Raju in Sandeep Gopi Shetty's Horror Movie

కార్తీక్ రాజు, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారాణంగా సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోందని, షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సందీప్ తెలిపాడు. సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళీ, భీమనేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఘంటశాల విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారని, మహి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నెరవేర్చుతున్నారని దర్శక నిర్మాత చెప్పారు.

Read Also : జూలై 23న శిల్పాశెట్టి ‘హంగామా -2’

హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ, ‘మిస్తీతో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. చిన్న‌పాప త‌న్వి ఇందులో కీల‌క పాత్ర చేసింది. ఆమె చుట్టూనే క‌థ తిరుగుతుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. ద‌ర్శ‌కుడు సందీప్‌ సినిమాపై ప్యాష‌న్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చారు. యూర‌ప్‌లో పాట‌ల‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో మిక్స్ చేయించారు’’ అన్నారు. ఈ చిత్రంలో తాను విలన్ పాత్ర చేస్తున్నానని ప్రశాంత్ కార్తి చెప్పారు. న‌టి ఆమ‌ని మాట్లాడుతూ ‘‘చిన్న పాప మీద బేస్ అయ్యి నడిచే ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. సందీప్‌ మంచి స్టార్ కాస్టింగ్‌తో, మంచి అవుట్‌పుట్ రాబ‌ట్టుకుంటున్నారు. మంచి పాత్ర చేస్తున్నాను. సినిమా బాగా వ‌చ్చింది. ఫ్యామిలీతో క‌లిసి కూర్చుని చూసే సినిమా’’ అన్నారు.

Exit mobile version