Site icon NTV Telugu

సీనియర్ హీరోయిన్ తో జతకట్టబోతున్న కార్తీ

Senior Actress Simran to Turn villain for Karthi

తమిళ స్టార్ హీరో కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. “ఖైదీ”, “సుల్తాన్” చిత్రాలతో సక్సెస్ ను సాధించిన కార్తీ అదే జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ‘సర్దార్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ చిత్రనిర్మాత పిఎస్ మిత్రాన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కార్తీ ద్వంద్వ పాత్ర పోషిస్తాడని చెబుతున్నారు. రాషి ఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇందులో కార్తితో జోడి కట్టబోతోందని సమాచారం.

Read also : హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతున్న రశ్మిక

సీనియర్ నటి సిమ్రాన్ పేరు మరో ప్రధాన పాత్ర కోసం పరిశీలనలో ఉంది. ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో యువ నటి రాజీషా విజయన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సౌండ్‌ట్రాక్ రూపొందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు.

Exit mobile version