హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతున్న రశ్మిక

రశ్మిక మందణ్ణ క్షణం తీరిక లేకుండా కాలం గడిపేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఆమె అంగీకరించిన సినిమాల షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. అయినా కొత్త అవకాశాలు వచ్చినా వాటినీ వదులుకోకుండా పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమ పడటానికి మన స్టార్ హీరోయిన్లు అలవాటు పడిపోయారు. రశ్మిక మందణ్ణ కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. సరిగ్గా ఆరు రోజుల క్రితం శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంది రశ్మిక… ఆ తర్వాత వారాంతంలో షూటింగ్ కు బ్రేక్ పడటంతో ముంబై వెళ్ళిపోయింది.

Read Also : ఐటమ్ కోసం తమ్ముకి 75 లక్షలు

మళ్ళీ ఇవాళ ఉదయం ఫ్లయిట్ లో ముంబై నుండి హైదరాబాద్ చేరి, నేరుగా షూటింగ్ స్పాట్ కు వెళ్ళిపోయింది. అంతే కాదు… తన డైలీ రొటీన్ ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది రశ్మిక. ఫ్లయిట్ లో హైదరాబాద్ వెళుతున్న ఫోటోను, అలానే ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా షూటింగ్ స్పాట్ ఫోటోనూ ఇందులో పెట్టడం విశేషం. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-