NTV Telugu Site icon

Karthi : సత్యం సుందరం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?

Untitled Design (28)

Untitled Design (28)

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. 96 మ్యూజిక్ డైరెక్టర్  గోవింద్ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Also Read : Amazon Prime : నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’..

కాగా ‘సత్యం సుందరం’ ను నిన్నచిత్ర యూనిట్ కు అలాగే  కొందరు మీడియా మిత్రులకు ప్రదర్శించారు మేకర్స్. చూసిన ప్రతి ఒక్కరు సత్యం సుందరం హాయిగా నవ్విస్తూ, అక్కడక్కడా ఏడిపిస్తూ, మరియు ఆనందింప చేసే ఒక రకమైన ఫీల్ గుడ్ డ్రామా.  80 నిముషాల మొదటి సగం ఒక సున్నితమైన కథాంశంతో సరికొత్త టేకింగ్ తో హృదయాన్ని తాకే ఎమోషన్స్ తో ఉందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని, మన మూలాలను మనకి గుర్తుచేస్తుందని, ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుందని తమిళ ప్రీమియర్స్ నుండి అందుతున్న సమాచారం. దర్శకుడు ప్రేమ్ కుమార్ స్క్రీన్ ప్లే సినిమాను మరింత ఎత్తులో నిలబెట్టిందని 96 సినిమా ఏ విధంగా ప్రతి ఒక్కరిని కదిలించిందో సత్యం సుందరం కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని టాక్. కానీ సినిమా ఒక నవల లా ఉంటుందని, స్లో గా సాగుతుందని, తమిళ నేటివిటీ ఎక్కువగా చూపించారని కొందరు విశ్లేషించారు. మరి తెలుగు ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.