బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం **’కర్మణ్యే వాధికారస్తే’**. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. “‘కర్మణ్యే వాధికారస్తే’ అనేది భగవద్గీతలోని ఒక గొప్ప వాక్యం. ‘పని చేయడం వరకే నీ వంతు, ఫలితం ఆశించవద్దు’ అనేది దాని అర్థం. ఈ టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కథ కూడా చాలా గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్” అని తెలిపారు.
Also Read :Tollywood Upcoming Movies: అప్‌డేట్స్ లేకున్నా వాటితోనే హైప్ పెంచేస్తున్నారుగా..!
మనం రోజూ టీవీల్లో, పేపర్లలో చూసే స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు. కథకు తగ్గట్టుగా బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ తమ అద్భుతమైన నటనతో చిత్రానికి ప్రాణం పోశారని యూనిట్ ప్రశంసించింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి, సెన్సార్ సభ్యులు ‘యు/ఏ’ (U/A) సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, “చిత్రం అద్భుతంగా ఉంది” అని చిత్ర బృందాన్ని కొనియాడినట్లు నిర్మాతలు తెలిపారు. ట్రైలర్‌తో పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని, అక్టోబర్ 31న చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది.
