Site icon NTV Telugu

అఫిషియల్ : రణ్‌వీర్ సింగ్ తో కరణ్ జోహార్ కొత్త చిత్రం

Karan Johar announces love story with Ranveer and Alia

ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఇందులో స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దాదాపు ఐదేళ్ల తరువాత కరణ్ జోహార్ ఈ సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నటులు జయ బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కీలకపాత్రల్లో నటించనున్నారు. రణ్‌వీర్ రాకీగా, అలియా రాణి పాత్రను పోషిస్తుంది. ఇది కుటుంబ విలువల నేపథ్యంలో సాగే లవ్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా నేడు రణ్‌వీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగానే ఈ కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. మరోవైపు రణ్‌వీర్ కు సోషల్ మీడియాలో ప్రముఖులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకంక్షాలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : చిక్కుల్లో కార్తీ “ఖైదీ”… స్పందించిన నిర్మాత

Exit mobile version