Site icon NTV Telugu

Kapil Sharma : కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – హింసను ఖండించిన నిర్వాహకులు

Kapil Sharma

Kapil Sharma

బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడాలోని కేఫ్‌ పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటన తెలిసిందే.  కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో గల సర్రే ప్రాంతంలో ‘కాప్స్‌ కేఫ్‌’ (Kap’s Cafe) పేరుతో కపిల్‌ శర్మీ దీన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే తాజాగా, ‘కాప్స్ కేఫ్’ నిర్వాహకులు ఈ దాడిని ఖండిస్తూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

Also Read : Bhahubali The Epic : ‘బాహుబలి – ది ఎపిక్’ రన్ టైం ఎంతో తెలుసా..!

ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక ‘ రుచికరమైన కాఫీ, స్నేహపూర్వకమైన సంభాషణలతో కస్టమర్‌లకు ఆనందాన్ని పంచాలనే ఆశతో ఈ కాప్స్‌ కేఫ్‌ను ప్రారంభించాం. ఇక్కడ హింస సృష్టించడం బాధాకరం. ఈ హింసకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడతాం. ఏమాత్రం వెనక్కి తగ్గం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘటన నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా కెనడా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో నుంచి తొమ్మిది రౌండ్లు కేఫ్‌పై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్‌ బృందాలు దర్యాప్తు చేపట్టాయికేఫ్‌పై కాల్పులకు ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్‌ సింగ్‌ లడ్డీ బాధ్యత వహించారు. కేఫ్‌పై తానే కాల్పులు జరిపినట్లు ప్రకటించారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Exit mobile version