NTV Telugu Site icon

Samantha: సమంతను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

Samantha

Samantha

హీరోయిన్లు సమంత తో పాటు కీర్తి సురేష్ అలాగే ఫ్యాషన్ డిజైనర్ కీర్తి రెడ్డి ని మోసగించిన ఒక మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి హీరోయిన్లను మోసం చేయడం ఏమిటి అనే అనుమానం కలుగుతుందా అసలు విషయం తెలుసుకుందాం పదండి. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఈ కాంతి దత్ సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో పలువురు సెలబ్రిటీల చేత పెట్టుబడులు పెట్టించి మోసగించాడు.

Pushpa 2: రిలీజ్ కి ముందు కొత్త టెన్షన్.. బాయ్ కాట్ కి పిలుపు!

నటుడు సామ్రాట్ రెడ్డి సోదరి ఫ్యాషన్ డిజైనర్, సమంతకు అత్యంత సన్నిహితంగా ఉండే శిల్పారెడ్డి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుని రిజిస్టర్ చేసిన పోలీసులు అప్పటినుంచి కాంతి దత్ కోసం గాలిస్తున్నారు. హీరోయిన్లు కీర్తి సురేష్, సమంత, పరినీతి చోప్రాతో పాటు శిల్పారెడ్డి వంటి వాళ్ళ దగ్గర సుమారు 100 కోట్లకు పైగా అతను లూటీ చేసినట్లుగా తెలుస్తోంది.