Kantara Chapter 1 Trailer: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ “కాంతార” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్యాన్-ఇండియా లెవెల్ లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలైన హృతిక్ రోషన్, పృథ్వి రాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read:Ranveer Singh : మరో సౌత్ దర్శకుడి రెండేళ్లు టైం వేస్ట్ చేసిన రణవీర్.. ఎవరంటే?
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మేకింగ్ గురించి, గ్రాండియర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ గురించి, హోంబలే ఫిలింస్ నిర్మాణ విలువల గురించి చర్చ జరుగుతోంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?