Site icon NTV Telugu

Kantara : ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ కంప్లీట్ – వైరల్ అవుతున్న జర్నీ గ్లింప్స్.. !

Kanthara 1

Kanthara 1

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు, ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ పై కూడా ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకోన్నాయి . కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూనే, ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రేక్షకులకు ఒక ప్రత్యేక గిఫ్ట్ అందించింది. అదే “Kantara Journey” పేరుతో విడుదల చేసిన ఇంట్రస్టింగ్ గ్లింప్స్ వీడియో.

Also Read : Nikhil : సినిమా కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ.. మల్టీప్లెక్స్ దందా పై నిఖిల్ కౌంటర్

ఈ గ్లింప్స్‌లో రిషభ్ శెట్టి తన ప్రయాణం, సినిమా పట్ల తన నమ్మకాన్ని, అలాగే ఈ ప్రాజెక్ట్‌కి వెచ్చించిన కృషిని అద్భుతంగా చూపించారు. ‘ఇది కేవలం సినిమా కాదు.. ఒక శక్తి’ అంటూ రిషబ్ భావోద్వేగంతో చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను 250 రోజులు పాటు నిష్టగా చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించడంతో, అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్‌లకు భారీ స్పందన వస్తుండగా, ఇప్పుడు విడుదలైన “Journey” వీడియో ఈ సినిమా హైప్‌ను మరింత పెంచేసింది. ఈ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ చూస్తుంటే మూవీ అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా థియేటర్లలో విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత చిత్రం ‘కాంతార’ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, ఇప్పుడు ఈ చాప్టర్‌ 1 ద్వారా మళ్లీ భారతీయ సినిమా స్టాండర్డ్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

 

Exit mobile version