Site icon NTV Telugu

KantaraChapter1 Collections : రికార్డ్స్ కొల్లగొడుతున్న కాంతార చాఫ్టర్ 1.. 6 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Kanthara Chapter1

Kanthara Chapter1

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టింది. కన్నడ తో పోటీగా తెలుగు స్టేట్స్, బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధిస్తోంది.

Also Read : South Cinema : బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కళకళలాడుతున్న సౌత్ ఇండస్ట్రీ..

ఇక ఫస్ట్ వీకెండ్ నాటికీ వరల్డ్ వైడ్ గా రూ. 231 కోట్లు కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ లోను 2 మిలియన్ మార్క్ అందుకుని దోసుకెళ్తోంది కాంతార చాఫ్టర్ 1. ఇక వర్కింగ్ డేస్ అయిన సోమవారం, మంగళవారం కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది కాంతార చాప్టర్ 1. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులకు గాను రూ. 427.5 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసి దూసుకెళ్తోంది. కన్నడలో రికార్డులు క్రియేట్ చేస్తూ వెళ్తోంది. కర్ణాటకలో వరుసగా 6 రోజులు రూ.15 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా కాంతారాచాప్టర్ 1 నిలిచింది. ఏడవ రోజు కూడా అడ్వాన్స్ సేల్స్ లో రూ. 5.7 కోట్లతో సెన్సేషన్ సాలీడ్ బుకింగ్స్ తో రన్ అవుతోంది. అటు నార్త్ అమెరికాలో 3 మిలియన్ వసూళ్లు రాబట్టి స్టడీగా రన్ అవుతోంది. తెలుగు స్టేట్స్ లో లాంగ్ రన్ లో రూ. 50 – 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా.

Exit mobile version