Site icon NTV Telugu

Kannappa : ‘కన్నప్ప’ కు కొత్త కష్టాలు.. బ్రాహ్మణ సంఘాల షాక్

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

టాలీవుడ్‌ యాక్టర్‌ మంచు విష్ణు నటిస్తోన్న బారీ చిత్రం ‘కన్నప్ప’. బాలీవుడ్‌ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్ ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిటిస్తున్నారు. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే మేకర్స్‌ ఈ మూవీ నుంచి లాంచ్‌ చేసిన టీజర్‌, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. తాజాగా

Also Read : Naslen : మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ మూవీలో పిలక గిలక అనే హ‌స్య పాత్రల్లో న‌టించిన‌ బ్రహ్మానందం, స‌ప్తగిరిల‌కు సంబంధించిన పోస్టరు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో బాగా వైర‌ల్ అవడంతో పాటుగా కొత్త తలనొప్పి కూడా తెచ్చిపెట్టింది. ఈ పిలక గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ‘కన్నప్ప’ సినిమాలో లేవని సినీనటులు మోహన్ బాబు, విష్ణు స్పష్టం చేయాలని’ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. గుంటూరు లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.. ‘సనాతన ధర్మాన్ని, హిందూ మత విశ్వాసాలను బతికిస్తున్న బ్రాహ్మణ జాతి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తుంది. ‘కన్నప్ప’ సినిమాలో పిలక-గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని మళ్లీ అవమానించారు. దేనికైనా రెడీ సినిమాలో కూడా అదేవిధంగా బ్రాహ్మణులను అవమానించారు, తాము అప్పట్లో హైకోర్టులో రిట్ వేయగా మూడు సన్నివేశాలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది’ అంటూ తెలిపారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Exit mobile version