Site icon NTV Telugu

Kannappa : మా విజయానికి కారణం ప్రేక్షకులే.. ఎమోషనల్ అయిన మోహన్ బాబు

Mohan Babu

Mohan Babu

విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా నిర్మాత డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ..

“భగవంతుని ఆశీస్సులతో ‘కన్నప్ప’ చిత్రానికి ఈ స్థాయిలో అద్భుతమైన విజయం లభించింది. నేను 50 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న, అభిమానుల ప్రేమ ఎప్పుడూ మారలేదు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. వారి అంకితభావంతో ఈ విజయం సాధ్యమైంది. దాదాపు మూడు దశాబ్దాల కల నిజమైంది.ఈ విజయాన్ని మన అభిమానులకు అంకితం ఇస్తున్నాను’ అని అన్నారు. తర్వాత విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఆశ్చర్యకరం. ఇది ఆధ్యాత్మికంగా జరిగిన శివలీల అనిపిస్తుంది. మా వంటి ఆర్టిస్టులకు దేవుళ్లు ప్రేక్షకులే. వాళ్ల ప్రేమతోనే మేం ఎదుగుతున్నాం. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘మోహన్ బాబు గారు, విష్ణు గారు గత పదేళ్లుగా ఈ సినిమాపై పట్టుదలతో పనిచేస్తున్నారు. అన్ని విభాగాల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఈ సినిమాను చూడాల్సిన వారు చాలామంది ఉన్నారు. తప్పకుండా థియేటర్‌లో చూసి ఆనందించండి’ అన్నారు.

Exit mobile version