ప్రజంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే ..
Also Read : Vijay Kanakamedala : అందుకే నాగ చైతన్యతో సినిమా ఆగిపోయింది..
ఇప్పుడు అన్న మంచు విష్ణు ‘కన్నప్పకి’ పోటీగా, మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ముగ్గురు కలిసి భారీ మల్టీస్టారర్ గా ‘భైరవం’ సినిమాని తెరకెక్కిన విషయం తెలిసిందే. మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే మనోజ్ ఓ ఈవెంట్ లో భాగంగా ‘భైరవం’ ఎప్పుడు రిలీజ్ అని అడగ్గా.. ‘ఏప్రిల్ లో వస్తున్నాం తమ్ముడు. చిన్న తెరల్లో కాదు ఈసారి వెండి తెరలో చూసుకుందాం అని డిసైడ్ అయ్యాను’ అని చెప్పాడు. దీంతో కన్నప్ప, భైరవం చిత్రాలు పోటీ పడుతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక తాజాగా ‘భైరవం’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘ ఓటీటీ డీల్స్ కారణంగానే సినిమా రిలీజ్ లేట్ అయింది, అప్పుడు రెండు రిలీజ్ డేట్స్ క్లాష్ అవ్వడంతో మనోజ్ అలా అన్నారు. అదేమీ లేదు మా నిర్మాతల మాట ప్రకారమే మేం రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు.
