Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవల్లో మళ్లీ సాలిడ్ సౌండ్ చేస్తున్న స్టార్ యశ్. ‘KGF 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ‘టాక్సిక్’తో వస్తున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 26న సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ప్రజెంట్ యశ్‌పై ఉన్నంత ఫోకస్ మిగతా కన్నడ స్టార్స్‌పై కనిపించడం లేదు.
Siva Rajkumar : కన్నడలో సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ వయసు, ఆరోగ్య పరిస్థితుల సవాళ్లు ఉన్నా సినిమాల విషయంలో మాత్రం ఆయన స్పీడ్ తగ్గలేదు. ‘పెద్ది’లో కీలక పాత్రతో తెలుగులోనూ కనిపించాడు. తమిళంలోకి కూడా అడుగుపెడుతూ, కన్నడతో పాటు ఇతర భాషల్లో తన మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. “666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్” ‘జైలర్ 2’, ‘బెయిల్’, ‘ఉత్తరకాండ’ లాంటి ప్రాజెక్టులతో కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు.
Also Read
- Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
- Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
- Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
- Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్‌డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
Darshan : కన్నడలో మాస్ ఫాలోయింగ్ విషయంలో దర్శన్‌ది సపరేట్ రేంజ్. కానీ ప్రస్తుతం దర్శన్ జైల్లో ఉన్నాడు. ఆయన చివరి చిత్రం ‘ది డెవిల్’ 2025 డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. దర్శన్ ప్రాజెక్ట్స్ ‘రాజావీర మదకరి నాయక’, సింధూర లక్ష్మణ ఎప్పుడొస్తాయన్న క్లారిటీ లేదు.
KICHAA : స్టార్ కిచ్చా సుదీప్ ‘మార్క్’ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఏకంగా నాలుగు స్క్రిప్ట్స్ లాక్ చేసినట్లు ప్రకటించాడు. అందులో కీలకమైనది అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బిల్లా రంగ బాషా – ది ఫస్ట్ బ్లడ్’. దాంతో పాటు దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఉన్నాడు.
Upendra : ఇక తనదైన డిఫరెంట్ కథలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర కూడా సైలెంట్‌గా లేడు. రజనీకాంత్ ‘కూలీ’లో కలీషాగా కనిపించిన ఉపేంద్ర ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘45’తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘భార్గవ’ షూటింగ్ ముగింపు దశలో ఉండగా.. ‘బుద్ధివంత 2’ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. మరోవైపు ఆగస్టు 2026లోనే ప్రారంభమైన ‘నెక్స్ట్ లెవెల్’ పాన్ ఇండియా బైలింగ్వల్‌గా తెరకెక్కుతోంది.
వీరందరూ సినిమాలు చేస్తున్నారు కానీ యశ్ ‘టాక్సిక్’ చుట్టూ కనిపిస్తున్నంత పాన్ ఇండియా హైప్ లేదు. ఈ స్టార్స్ దగ్గర ఉన్న సినిమాలు మాత్రం తక్కువేం కాదు. హైప్లో యశ్ ముందున్నాడు కానీ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న స్టార్స్ కన్నడలో ఇంకా చాలామందే ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు మళ్లీ శాండల్‌వుడ్‌కి పాన్ ఇండియా పవర్ చూపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!