NTV Telugu Site icon

Actress Shobhita : మిస్టరీగా మారిన కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య

Shobhita

Shobhita

కన్నడ బుల్లితెర నటి, యాంకర్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గడచిన ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. కన్నడలో చాలా సీరియల్లో నటించిన శోభిత  గత కొన్నాళ్లుగా భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది.  ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. శోభిత మృతి పై  కారణాలు  కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. శోభిత మృతి దేహంను  పోస్టుమార్టనికి తరలించారు పోలీసులు.

కాగా నటి శోభిత ఆత్మహత్య  మిస్టరీగా  మారింది. శోభిత మృతి చెంది 24గంటలు దాటిన సూసైడ్ గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. శోభిత (32) ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు  చేస్తున్నారు గచ్చిబౌలి పోలిసులు. శోభిత స్నేహితులు, నైబేర్స్, కుటుంబ సభ్యుల నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసి,  ఆత్మహత్యకు ముందు శోభిత ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడిందనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల శోభిత దంపతులు గోవా వెళ్లి  వచ్చారని తెలిసింది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం అక్టివ్ గా ఉండే శోభిత తన పెళ్లి ఫొటోస్ ఇప్పటి వరకు షేర్ చేయకపోవడంపై సస్పెన్స్ నెలకొంది. గతేడాది సుధీర్ అనే సాఫ్ట్ వేర్ ను పెళ్లి  చేసుకుంది శోభిత. ఓ మ్యాట్రిమోనీలో శోభిత ప్రొఫైల్ చూసి మ్యారేజ్ ప్రపోజల్ చేసాడు సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డితో మ్యారేజ్ చేసుకున్న తర్వాత సీరియల్ నటించడం మానేసింది శోభిత. కానీ ఏడాది తిరిగిలోపే ఆత్మహత్య చేసుకుంది నటి శోభిత. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  పోస్టుమార్టం తర్వాత శోభిత మృతదేహాన్ని బెంగళూరుకి తీసుకువెళ్లనున్న కుటుంబ సభ్యులు.