KGF సిరీస్‌తో కన్నడ ఇండస్ట్రీకి అసలైన పాన్-ఇండియా రేంజ్ తెచ్చాడు యష్. ఆ తరువాత రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో కల్చర్‌తో పాటు క్లాస్‌ని చూపించాడు. వీళ్లిద్దరూ తక్కువ బడ్జెట్ సినిమాలతో భారీగా కలెక్షన్లు కొల్లగొట్టారు. దాంతో కన్నడ సినీ మార్కెట్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు, వీళ్ల ట్రాక్‌ను ఫాలో అవుతూ అదే స్థాయికి చేరే ప్రయత్నంలో ఉన్నవారిలో చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి ఒకరు.
Also Read : Coolie : హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టి దొరికిన లోకేష్ కనకరాజ్
ధృవ సర్జా – కన్నడ మాస్ హీరో ఇప్పుడు K.D: The Devil తో పాన్ ఇండియా స్టేజ్‌కు ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు, ఇది మాస్ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. సంజయ్ దత్ విలన్‌గా మరోసారి ఫుల్ స్వింగ్‌లో కనిపించనున్నాడు. ఈ కాంబినేషన్ చూసి యష్ ఫాలోవర్స్ చాలామంది ఈ చిత్రాన్ని ‘Next KGF Vibe’ అంటున్నారు. మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినా, హైప్ మాత్రం ఆకాశాన్నంటుతోంది. గణేష్ నటించిన పినాక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు రెడీ ఆవుతోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. కన్నడ నుంచి పాన్ ఇండియా దూకుడు దూకుడు స్టార్ట్ అయింది “KGF” సిరీస్ ద్వారా యశ్, “కాంతార” ద్వారా రిషబ్ శెట్టి తర్వాత కన్నడ స్టార్స్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు గణేష్ పినాక మరియు ధ్రువ సర్జా కె.డి. సిద్దం అవుతున్నాయి. రెండు సినిమాల మధ్య కంపారిజన్ కూడా గట్టిగానే ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు పాన్ ఇండియా హిట్ కొడతారో.
