ఇప్పటి వరకు పొరుగు ఇండస్ట్రీల నుండి హీరోయిన్లనే తెచ్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు యంగ్ హీరోల ఫ్టోటింగ్ కూడా పెరిగింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడటంతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు.. మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యారు దుల్కర్ అండ్ ధనుష్. దుల్కర్ ఆల్మోస్ట్ తెలుగబ్బాయిగా మారిపోతే.. ధనుష్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు వీళ్లనే ఫాలో అవుతున్నాడు కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి.
Also Read : sai Pallavi : తండేల్ తర్వాత కనిపించని సాయి పల్లవి.. అసలేం చేస్తుంది?
దియాతో కన్నడలో పాపులారిటీ తెచ్చుకున్న దీక్షిత్ నాలుగేళ్ల క్రితమే ముగ్గురు మొనగాళ్లు చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రమిచ్చాడు. ద రోజ్ విల్లా అనే మూవీ ఎప్పుడొచ్చిందో తెలియదు. కానీ కన్నడ హీరో రిజిస్టరయ్యింది మాత్రం దసరాతోనే. నాని, దసరాలో సూరి క్యారెక్టర్‌లో కనిపించింది కాసేపే అయినా స్టోరీ మొత్తం ఇతడి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ కూడా ది బెస్ట్ ఫెర్మామెన్స్ ఇచ్చాడు దీక్షిత్. సినిమా వల్ల తనకు నెగిటివ్ రిమార్క్ వస్తాయని తెలిసి కూడా రిస్క్ చేసి మంచి మార్కులేయించుకున్నాడు. ఇక తెలుగు అబ్బాయిగా స్థిరపడేందుకు టాలీవుడ్‌లో టూ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కింగ్ జాకీ క్వీన్ తో పాటు షబారా అనే ఫిల్మ్ చేస్తున్నాడు. అంతే కాదు.. ఇక్కడి మార్కెట్ కొల్లగొట్టేందుకు తన కన్నడ సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నాడు. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీని కూడా ఇక్కడ డబ్ చేసి విడుదల చేయబోతున్నాడు. అలాగే కన్నడ, తమిళంలో, మలయాళంలోనూ మూవీ చేస్తూ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తున్నాడు. ఇక్కడ ఎంతో కొంత మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ఉపేంద్ర, సుదీప్, రిషబ్‌లా.. దీక్షిత్ తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడేమో చూడాలి.
