NTV Telugu Site icon

Kanguva : సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాదిస్తోంది : కేఈ జ్ఞానవేల్ రాజా

Studio Green

Studio Green

స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు రిలీజైన ప్రతి ఏరియా నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్ హ్యాపీనెస్ ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా. అందులోని కొన్ని ముఖ్యంశాలు మీ కోసం

1. ‘కంగువ’ సినిమాకు మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ టేస్ట్ మరోసారి వెల్లడైంది. తమిళ్ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్ వస్తున్నాయి. సూర్య గారి సినిమాల్లో టిల్ డేట్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ‘కంగువ’ నిలుస్తుంది.

2. నార్త్ బెల్ట్ లో ‘కంగువ’ మంచి నెంబర్స్ చేస్తోంది. వీక్ డేస్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గుడ్ సైన్ అంటూ అక్కడి నుంచి బాక్సాఫీస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నార్త్ లో రిలీజైన అన్ని సౌత్ మూవీస్ లో ‘కంగువ’ బిగ్ ఓపెనింగ్స్ దక్కించుకుంటోంది. మా టీమ్ మెంబర్స్ థియేటర్స్ కు వెళ్లి ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.

3. మూవీ ప్రొడక్షన్ లో దర్శకుడు శివ చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ టెన్షన్స్ నా మీద పడకుండా కొంత తగ్గించారు.   క్లైమాక్స్ లో వచ్చే గెస్ట్ రోల్ ను సర్ ప్రైజ్ కోసం రివీల్ చేయలేదు. మేము అలా హైడ్ చేసి ఉంచడం వల్లే ఈరోజు థియేటర్స్ లో ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు.

4. సూర్య గారు చేసిన రెండు డిఫరెంట్ రోల్స్ కు మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఆయన ఈ మూవీ కోసం పడిన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. సూర్య నటనకు ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందిస్తున్నారు. బాబీ డియోల్ పర్ ఫార్మెన్స్ మరో హైలైట్ అని చెబుతున్నారు. బాబీ డియోల్ గారి సెలెక్షన్ డైరెక్టర్ శివ గారి ఛాయిస్.

5. ‘కంగువ’కు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ది బెస్ట్ అందించారు. యోలో, ఫైర్ సాంగ్, నాయకా ఇలా ప్రతి సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. బీజీఎం కొంత సౌండ్ ఎక్కువగా ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అది థియేటర్స్ లో రెండు పాయింట్స్ తగ్గిస్తున్నాం. లౌడ్ సౌండ్ టెక్నికల్ గా జరిగిన మిస్టేక్ గానీ దేవి తప్పేం లేదు.

6. ‘కంగువ’ 2 సినిమాలో దీపిక పడుకోన్ ను నాయికగా తీసుకుంటున్నామనే విషయంలో నిజం లేదు. ఇంకా ఆ మూవీ వర్క్స్ స్టార్ట్ చేయలేదు. డైరెక్టర్ శివ కు అజిత్ తో ఓ మూవీ చేయాల్సిన కమిట్ మెంట్ ఉంది.

7. ప్రస్తుతం కార్తితో మా స్టూడియో గ్రీన్ లో చేస్తున్న వా వాతియర్ జనవరి చివరలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ఆ సినిమా తర్వాత మా సంస్థలో చేసే కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటిస్తాం.

Show comments