NTV Telugu Site icon

కొత్త ఏడాది.. పార్టీలో కాకుండా పూజలో కనిపించిన ఫైర్ బ్రాండ్

kangana

kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసిన సంచలనమే.. ఏమి మాట్లాడినా వివాదాస్పదమే.. అందరు చేసే పనిని ఆమె చేయదు. సాధారణంగా కొత్త సంవత్సరం స్టార్ లందరు కుటుంబాలతో కలిసి పార్టీలు చేసుకుంటారు.. గోవా, మాల్దీవులు అంటూ ట్రిప్ లకు వెళ్తారు. ఇప్పటికి పలువురు తారలు అదే పని చేస్తూ కనిపించరు కూడా… అయితే వారిలా నేనెందుకు చేయాలి అనుకున్నదో ఏమో కంగనా నేడు రాహు కేతు పూజలో పాల్గొని దైవ భక్తిలో మునిగిపోయింది.

నేడు కంగన ఏపీ లోని తిరుపతి మరియు శ్రీకాళహస్తి దేవాలయాలను సందర్శించి, మొక్కులు చెల్లించారు. అనంతరం రాహు కేతు పూజలో పాల్గొని స్వామివారికి పూజ చేశారు. కంగనాకు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనం చేయించిన వేద పండితులు ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఇక ఒక్కసారిగా ఆలయాలను కంగనా సందర్శించడంతో ఆమెకు పోలీసులు భద్రతను పెంచారు. ఇటీవల రైతు సమస్యల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను పలువురు ఆమెను చంపేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు.

https://www.instagram.com/p/CYLWUgclqpK/