అక్కినేని సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ లో సమంత పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డీ-గ్లామర్ లుక్ లో సమంత తన పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసించింది. సామ్ బోల్డ్ పాత్రతో పాటు ఆమె నటనను అభినందించింది. ఇన్ స్టా వేదికలో స్పందించిన కంగనా ‘దిస్ గర్ల్ హేస్ మై హార్ట్’ అని తన వాల్ పై రాసి సమంత లుక్ సంబంధించిన ‘ఐ విల్ కిల్ దెమ్‘ అని ఉన్న స్క్రీన్ షాట్ ను జత చేసింది. ఈ వెబ్‌సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.