ఇటివల OTT లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘మిసెస్’. సన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, 2021లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. నిశాంత్ దహియా,కన్వల్జిత్ సింగ్,అపర్ణ ఘోషల్,నిత్య మొయిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం లో పెళ్లి తర్వాత ఒక స్త్రీ అత్తగారింట్లో ఎలాంటి కష్టాలు ఎదురుకుంటుంది..ఇంటి చాకిరి గురించి పాయింట్ ఔట్ చేసి తీశారు. అయితే ఈ మూవీ పై చాలా మంది నటినటులు అలాగే ఇతరులు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇటివల ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ అనే పురుష హక్కుల సంస్థ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘ ‘మిసెస్’ మూవీ మితిమీరిన స్త్రీ వాదాన్ని ప్రోత్సహిస్తుంది.ఒక మహిళ తన ఇంటి పని తాను చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల అవసరాలు తీరిస్తే అది అణచివేత ఎలా అవుతుంది. వంట చెయ్యడం ద్వారా ఒత్తిడి దూరమయ్యే ప్రశాంతత లభిస్తుంది. కుటుంబం కోసం మగవాళ్ళు ఎంతో శ్రమిస్తారు. ఒత్తిడికి కూడా లోనవుతారు’ అది కూడా చూడాలి అని ట్వీట్ చేసింది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ క్వీన్ .. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా పరోక్షంగా విమర్శలు చేసింది..
‘ఉమ్మడి కుటుంబంలో ఉండే పెద్ద వారు, కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తుంటారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో సందేహం లేదు. కానీ బాలీవుడ్‌లో వచ్చే ప్రేమ కథా చిత్రాలు, వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకరిస్తున్నారు. జీవితం చాలా చిన్నది. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోవాలి. గుర్తింపు కోసం ఎక్కువ పోరాటం చేస్తే చివరికి ఒంటరిగా మిగిలి పోవాల్సి వస్తుంది’ అని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రాసుకొచ్చింది కంగనా. మొత్తానికి హిందీ చిత్ర పరిశ్రమపై కంగనా మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.